- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడు 15..తర్వాత 23..డీలిమిలిటేషన్‌తో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగనున్నాయి.

ఇప్పుడు 15..తర్వాత 23
l డీలిమిలిటేషన్‌తో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
l రెండు నుంచి మూడుకు చేరనున్న లోక్ సభ స్థానాలు
దిశ , హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ లో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పు డున్న 119 నియోజకవర్గాలకు గా ను 60 నియోజకవర్గాలు పెంచాల నే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జి ల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సం ఖ్య కూడా పెరుగనుంది. జిల్లాలో ఇప్పుడు మొత్తం 15 నియోజకవర్గాలుండగా వీటి సంఖ్య 22 నుంచి 23కు, జీహెచ్ఎంసీ పరిధిలో చూ స్తే ప్రస్తుతం ఉన్న 24 నుంచి 35కి పెరిగే అవకాశం ఉంది. ఇదే సమ యంలో ఇప్పుడున్న రెండు పార్ల మెంట్ స్థానాల పరిధిలో మూడు ఏర్పడనున్నాయి. ఈ పెంపుతో గ్రే టర్ హైదరాబాద్ పరిధిలో జనాభా కు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు మారి, రాజకీ య ముఖచిత్రం మారనుంది.
పునర్వ్యవస్థీకరణ చట్టం ...
జనాభా పెరుగుదల, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం, తెలంగాణలో ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 స్థానాలకు పెరగనున్న ట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, జూ బ్లీహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్‌ప ల్లి, ఎల్బీనగర్ వంటి పట్టణ నియోజకవర్గాల పరిధిలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. కేంద్రం చే పట్టనున్న ఈ ప్రక్రియ రాబోయే సె న్సస్ (జనాభా గణన) తర్వాత అధికారికంగా అమల్లోకి రానుందని ముందుగా అనుకున్నా 2011 జనా భా లెక్కల ప్రకారమే జరుగనుందనే టాక్ రాజకీయ వర్గాలలో నడుస్తోం ది. కొత్తగా ఏర్పడే స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తించే అవకాశం సైతం ఉంది. 1952, 1957 లలో చాదర్‌ఘాట్, సోమాజిగూడ వంటి పేర్లతో నియోజకవర్గాలు ఉండేవి. పునర్విభజన తర్వాత పాత పేర్లు తిరిగి రావడం లేదా కొత్త భౌగోళిక ప్రాంతాల పేర్లతో సెగ్మెంట్లు ఏర్పడవచ్చు.
ఇప్పుడున్న నియోజకవర్గాలు
హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా ఇలా ఉంది . 1. ముషీరాబాద్ 2. మలక్ పేట్ 3. అంబర్ పేట్ 4. ఖైరతాబాద్ 5. జూబ్లీహిల్స్ 6. సనత్ నగర్ 7. నాంపల్లి 8. కార్వాన్ 9. గోషామహల్ 10. చార్మి నార్ 11. చాంద్రాయణ్ గుట్ట 12. యాకుత్ పురా 13. బహ దూర్ పురా 14. సికింద్రాబాద్ 15. కంటోన్మెంట్
పార్లమెంట్ స్థానాలు ...
1. సికింద్రాబాద్
2. హైదరాబాద్






