- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరి వేసుకొని ఆర్మీ అధికారి ఆత్మహత్య
ఉరి వేసుకుని ఓ ఆర్మీ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, మెహిదీపట్నం : ఉరి వేసుకుని ఓ ఆర్మీ అధికారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర సింగ్ (40) లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ లో ఉన్న మిలిటరీ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ హోదాలో పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం తెల్లవారుజామున ఆయన తన క్వాటర్స్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్యా పిల్లలు పంజాబ్ రాష్ట్రంలోనే వారి స్వస్థలంలో ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






