భ‌ర్త‌తో గొడ‌వ‌.. కూతురుతో స‌హా మ‌హిళా అదృశ్యం

by Ratna Kumari |

భ‌ర్త‌తో గొడ‌వ ప‌డిన ఓ మ‌హిళా కూతురుతో క‌లిసి అదృశ్య‌మైన ఘ‌ట‌న బుధ‌వారం వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

భ‌ర్త‌తో గొడ‌వ‌.. కూతురుతో స‌హా మ‌హిళా అదృశ్యం
X

దిశ, వనస్థలిపురం : భ‌ర్త‌తో గొడ‌వ ప‌డిన ఓ మ‌హిళా కూతురుతో క‌లిసి అదృశ్య‌మైన ఘ‌ట‌న బుధ‌వారం వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ ర‌విబాబు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జూప‌ల్లి రాజు, రాజ్య‌ల‌క్ష్మీ(33) భార్య భ‌ర్త‌లు. వీరు కూతురు చిర్వి(12) తో క‌లిసి ఎన్‌జీఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈనెల 21న రాత్రి భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో అర్థ‌రాత్రి స‌మ‌యంలో భార్య రాజ్య‌ల‌క్ష్మీ త‌న కూతురుని తీసుకొని భ‌ర్త‌కు చెప్ప‌కుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారి ఆచూకి ల‌భించ‌క‌పోవ‌డంతో భ‌ర్త రాజు వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు సీఐ తెలిపారు.

Next Story