- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆభివృద్దే తమ ధ్యేయం
నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయలతో అన్ని డివిజన్లలోనూ మౌళిక వసతులు

దిశ, శేరిలింగంపల్లి: నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయలతో అన్ని డివిజన్లలోనూ మౌళిక వసతులు కల్పిస్తున్నామని పీఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, బీటీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్లు హమీద్ పటేల్, గంగాధర్ రెడ్డితో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, నియోజకవర్గంలోని కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం పనులు చేపడుతున్నామని అన్నారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






