HYDRAA : హైడ్రాకు మరో కీలక బాధ్యతలు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA)కు వర్షాకాలంలో వరదల నిర్వహణ బాధ్యతలను కేటాయిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ కె. ఇలంబర్తి(Ilambarti) ఉత్తర్వులు జారీ చేశారు.

HYDRAA : హైడ్రాకు మరో కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA)కు వర్షాకాలంలో వరదల నిర్వహణ బాధ్యతలను కేటాయిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ కె. ఇలంబర్తి(Ilambarti) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)లో వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హైడ్రాకు ఈ బాధ్యతలు అప్పగించారు. వాన నీటి నిల్వ, నాలాల్లో పూడికతీతలు, రహదారులపై పేరుకు పోయిన బురద తొలగించడం, నెలకొరిగిన చెట్ల తొలగింపు వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కాగా జలమండలి, విద్యుత్ శాఖ సమన్వయంతో హైడ్రా ఈ పనులు చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇదివరకే GHMC పరిధిలో హైడ్రాకు ట్రాఫిక్ నియంత్రణ వంటి అదనపు బాధ్యతలు కూడా కేటాయించబడ్డాయి.

Next Story