హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో లవ్ జిహాద్.. పాక్ యువకుడు అరెస్ట్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో లవ్ జిహాద్.. పాక్ యువకుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్రమంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ పాకిస్తానీ యువకుడు ఇక్కడి అమ్మాయిని ప్రేమమా పేరుతొ పెళ్లి చేసుకొని పేరు మార్చి పాకిస్తాన్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసాడు. చివరి నిముషంలో పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. పాకిస్తాన్ కు చెందిన ఫహద్ అనే యువకుడు హైటెక్ సిటీలోని ఒక సిపాల్ కంపెనీలో పని చేస్తూ, తన తోటి ఉద్యోగి అయిన కీర్తిని ప్రేమ పేరుతో వివాహానికి ఒప్పించాడు. ఆమె పేరును దోహా ఫాతిమా గా మర్చి వివాహం చేసుకున్నాడు.

అయితే ఇటీవల ఫహద్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కీర్తి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఆ ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. కాగా ఫహద్ 1998లో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. పోలీసుల అనుమానాల ప్రకారం, ఫహద్ పెళ్లి పేరుతో పలువురు మహిళలను మోసం చేసినట్లు వివరాలు సేకరించారు. మరింతమంది మహిళలను టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

Next Story