Meeralam Cable Bidge : హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జ్

by Muthe.Rajitha |

హైదరాబాద్(Hyderabad) వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).

Meeralam Cable Bidge : హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) వాసులకు మరో గుడ్ న్యూస్ వినిపించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నగరంలోని ఓ ప్రదేశాన్ని త్వరలో మరో అందమైన టూరిస్ట్ ప్లేస్ గా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే గ్రేటర్లో అనేక టూరిస్ట్ స్పాట్స్(Tourist Places) ఉన్నాయి. వాటిలో.. చార్మినార్, గోల్కొండ, జూ పార్క్, హుస్సేన్ సాగర్, కొత్త సచివాలయం, అతి ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యు, లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, మల్కమ్ చెరువు లాంటి అనేక ప్రదేశాలు ఉండగా.. ఆయా ప్రదేశాలకు సందర్శకులు పోటెత్తుతారు. వీటితోపాటు మరో అందమైన చెరువును టూరిస్ట్ ప్లేస్ గా మార్చనుంది రేవంత్ రెడ్డి సర్కార్.

ఓల్డ్ సిటీలో జూ పార్కు(Zoo Park)ను అనుకోని ఉన్న మీరాలం చెరువు(Meeralam Tank)ను భారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మీరాలం చెరువుపై మరో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి(Suspension Cable Brdge)ని నిర్మించనుండగా.. ఇప్పటికే హెచ్ఎండీఏ(HMDA) అన్ని అనుమతులు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జ్ తోపాటు చెరువు చుట్టూ ఓ భారీ పార్కును నిర్మించేందుకు కూడా కార్యాచరణకు దిగింది. అయితే దీనికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేందుకు పీపీపీ విధాననంలో మరింత ఎక్కువ ఖర్చు చేసి, భారీ హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

పైవంతెనకు ఆర్నమెంట్‌ లైటింగ్, వ్యూ పాయింట్లు, చెరువులో మ్యూజికల్‌ ఫౌంటెయిన్లు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఆకృతుల ఏర్పాటు, మూడు పెద్ద దీవుల్లో టూరిస్టుల కోసం విడిది కేంద్రాలు, హోటల్స్ నిర్మాణం, మరో రెండు చిన్న దీవుల్లోనూ అద్భుతమైన పార్కులు, ఐదు దీవులను కలుపుతూ పైవంతెన మార్గాలు, చెరువు చుట్టూ గ్రీనరీ అభివృద్ధి, ఆటపాటలు, క్రీడా వసతులు కల్పించనున్నారు. మెుత్తం రూ.1900 కోట్లతో కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి, పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. మెుత్తం 2.5 కి.మీ పొడవుతో, నాలుగు లైన్లుగా 16.5 మీటర్ల వెడల్పుతో సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మించాలని భావిస్తున్నారు.

చెరువుకు వెస్ట్ వైపున ఉన్న దక్కన్‌ పార్కు నుంచి తూర్పున ఉన్న బెంగళూరు జాతీయ రహదారి మధ్య దీన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం ద్వారా.. కిషన్‌బాగ్‌ నుంచి వంతెన పైకి ఎక్కేలా అప్‌ ర్యాంపు, దక్కన్‌ పార్కు నుంచి చింతల్‌మెట్‌ వైపు రోడ్డుకు వంతెన డౌన్‌ ర్యాంపు, జాతీయ రహదారి నుంచి బహదూర్‌పుర, అత్తాపూర్‌ వైపు నుంచి రాకపోకలు సులువుకానున్నాయి.

Next Story