Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య.. పైలట్ చాకచక్యంతో తప్పిన భారీ ముప్పు

by Muthe.Rajitha |

ఇటీవల ఎయిర్ ఇండియా(Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే.

Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సమస్య.. పైలట్ చాకచక్యంతో తప్పిన భారీ ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఎయిర్ ఇండియా(Air India) విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ముప్పు తప్పినట్టైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport) నుంచి ముంబై(Hyderabad-Mumbai)కి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలిత్తింది. విమానం రన్‌వే పైకి వచ్చిన వెంటనే పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెంటనే టేకాఫ్ నిలిపివేసి, విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ప్రయాణికులను దించి, వారిని వెంటనే మరో విమానంలో ముంబైకి తరలించే ఏర్పాటు చేశారు.

ఈ సంఘటనకు గురించి ఎయిర్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా ఇటీవల ఎయిర్ ఇండియా విమానాలను వరుసగా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం అనంతరం జూన్ 17న శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం(AI180) కోల్‌కతాలో ఇంజిన్ సమస్య కారణంగా నిలిచిపోయింది. ఇలాంటి సంఘటనలతో ఎయిర్ ఇండియా విమానాల భద్రతా పరిశీలనలపై DGCA పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది.

Next Story