లాలాగూడ-మౌలాలి రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని యువకుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

లాలాగూడ, మౌలాలి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చిన్న మురుగునీటి కాలువలో గుర్తు తెలియని యువకుడి మృత దేహం ల‌భ్య‌మైంది.

లాలాగూడ-మౌలాలి రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని యువకుడు మృతి
X

దిశ, సికింద్రాబాద్ : లాలాగూడ, మౌలాలి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చిన్న మురుగునీటి కాలువలో గుర్తు తెలియని యువకుడి మృత దేహం ల‌భ్య‌మైంది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకుడిగా గుర్తించారు. చామన ఛాయ రంగు కలిగి ఉండి, తెలుపు రంగుపై బూడిద చెక్స్ షర్ట్, మెరూన్ ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రాథమికంగా అతను మద్యం మత్తులో లేదా గుర్తు తెలియని అనారోగ్య కారణాలతో కానీ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ ఎస్‌ఎస్ సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తు పట్టిన వారు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను 8712658581 లేదా దర్యాప్తు అధికారిని 9666280808 నంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Next Story