ఏటీఎంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్యం

by Ratna Kumari |

ఏటీఎంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న మెహిదీప‌ట్నం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఏటీఎంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్యం
X

దిశ‌, కార్వాన్: ఏటీఎంలో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న మెహిదీప‌ట్నం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం లో ఓ వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. వెంట‌నే స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ఏటీఎం త‌లుపు తెరిచి ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని పోలీసులు బ‌య‌టికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ వ్య‌క్తి ఏటీఎంలోకి వెళ్లిన త‌రువాత త‌లుపు లాక్ అవ్వ‌డంతో లోప‌ల ఊపిరి ఆడ‌కపోవ‌డంతో మృతి చెందిన‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ర‌క్త‌పు మ‌డుగులో ఉండ‌టంతో అత‌నే వ‌చ్చాడా..? లేక ఎవ‌రైనా హ‌త్య చేశారా..? అనే కోణంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story