డీఏల విడుదలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి

by Naveena |

ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

డీఏల విడుదలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ బుధవారం మాట్లాడుతూ ..రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు డీఏ ప్రకటన కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, మరో మూడు నెలల్లో మరో డీఏ కూడా ఉద్యోగులకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీంతో కలిపి పెండింగ్ డీఏలు ఆరుకు చేరుతాయన్నారు .గతంలో డీఏ విడుదల చేసిన సమయంలో మార్చి నెలలో మళ్లీ డీఏ పై ప్రకటన ఉంటుందని సీఎం ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. త్వరలో ఉగాది, రంజాన్ పండుగలు ఉండడం, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతుండడంతో.. కనీసం ఒక్క డీఏ నైనా విడుదల చేస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలని ఫారూఖ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు . ఉద్యోగులంతా సీఎం ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.

Next Story