ఉవ్వెత్తున గిరిజనుల నిరసన.. రెండో రోజు కూడా మొత్తం బంద్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-03 02:19:04  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా మూగబోయింది....

ఉవ్వెత్తున గిరిజనుల నిరసన.. రెండో రోజు కూడా మొత్తం బంద్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharama Raju) మూగబోయింది. ప్రత్యేక డీఎస్సీ(Dsc) కోసం గిరిజనులు బంద్ పాటిస్తున్నారు. ఈ నిరసనకు మిగిలిన సామాజిక వర్గాలు, ప్రజలు స్వచ్చంధంగా మద్దతు పలికారు. దీంతో తొలిరోజు బంద్(Bandh) విజయవంతంగా ముగిసింది. ఈ రోజు కూడా గిరిజనుల నిరసన కొనసాగుతోంది. అరకు(Araku), పాడేరు(Paderu) సహా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు(Rtc Buses) డిపోలకే పరిమితమయ్యాయి. తమకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలంటూ నినాదాలు చేస్తూ ఆర్డీసీ డిపోల ముందు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

Next Story