హోటళ్లలో ఇవేం పనులు? కాచిగూడలో లాడ్జింగ్‌లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

by Ajay Maddhiboyina |

కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జిం గ్ లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రతిరోజూ నగర నలుమూలలే కాకుండా వివిధ రాష్ట్రా ల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చిపోయే వారు హోటళ్లను ఆశ్రయి స్తూ తమ కార్యకలాపాలను యథే చ్ఛగా సాగిస్తున్నారు.

హోటళ్లలో ఇవేం పనులు? కాచిగూడలో లాడ్జింగ్‌లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
X

దిశ, హిమాయత్ నగర్ : కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జిం గ్ లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రతిరోజూ నగర నలుమూలలే కాకుండా వివిధ రాష్ట్రా ల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చిపోయే వారు హోటళ్లను ఆశ్రయి స్తూ తమ కార్యకలాపాలను యథే చ్ఛగా సాగిస్తున్నారు.

రోజూ పదుల సంఖ్యలో..

అంబర్ పేట నియోజకవర్గంలోని కా చిగూడ డివిజన్లో దాదాపు 30 హోట ళ్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న పేరొందిన ఓ హోటల్‌కు ప్రతిరోజూ జంటలు జంటలుగా చేరుకొని యథేచ్ఛగా అ సాంఘిక కార్యకారపాలకు పాల్పడుతున్నారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత హోటల్ యజమానులు మాత్రం హోటల్‌కు వచ్చే యువతీ యువకుల అడ్రస్‌లు సమగ్రంగా సేకరించకుండా విచ్చలవిడిగా రూమ్ లను బుక్ చేస్తూ వారికి ఆశ్రయాలు కల్పిస్తున్నారడంలో ఎ లాంటి సందేహం లేదు. ఇతర రా ష్ట్రాల నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌ కు వచ్చే ప్రయాణికులు రాత్రి వేళల్లో హోటల్లో ఉండాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికులు తమకు టుంబ సభ్యులతో లంచ్, డిన్నర్ చేసుకోవడానికి హోటల్ కు రావాలంటేనే భయపడుతున్నారు.

తనిఖీలు నిర్వహిస్తేనే..

ఇప్పటికైనా సంబంధిత పోలీసులు కాచిగూడ డివిజన్‌లోని హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి హోటళ్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెంచి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story