- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ నిర్మాణాలకు అడ్డాగా అల్లాపూర్!
హైటెక్ సిటికి కూతవేటు దూరం ఉండటంతో అనుకున్నంత అద్దె, అమ్ముకుంటే కోట్లలో లాభాలు వస్తుండటంతో 50 గజాల నుంచి 2, 3 వందల గజాల వరకు ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

దిశ, కూకట్‌పల్లి : హైటెక్ సిటికి కూతవేటు దూరం ఉండటంతో అనుకున్నంత అద్దె, అమ్ముకుంటే కోట్లలో లాభాలు వస్తుండటంతో 50 గజాల నుంచి 2, 3 వందల గజాల వరకు ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్ అల్లాపూర్ డివిజన్ నేడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే టాక్ వినబడుతుంది. హైటెక్‌సిటి, మాధాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలు సమీపంలో ఉండటంతో ఇక్కడ భూముల ధరలకు, ఇండ్ల కిరాయిలకు రెక్కలు వస్తున్నాయనే చెప్పవచ్చు. అల్లాపూర్డివిజన్లోని పద్మావతినగర్, గాయత్రినగర్, వివేకానందనగర్, పర్వత్‌నగర్, జనప్రియనగర్, లక్ష్మినగర్, తులసినగర్, ప్రెండ్స్ కాలనీలలో 50 గజాల నుంచి 3 వందల గజాల వరకు ఉన్న స్థలాలలో బహుళ అంతస్థుల నిర్మాణాలే కనిపిస్తుఉంటాయి. జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా యధేచ్చగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో నిర్మాణదారులు తమ నిర్మాణ పనులను యధేచ్చగా చేపడుతున్నారు.
సెట్ బ్యాక్, వెంటిలేషన్‌లు పట్టవు..
నిర్మాణదారులు పనులు చేపట్టే సమయంలో కనీసం సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇండ్లకు ఇండ్లకు మధ్య కనీసం వెలుతురు దూరే స్థలం కూడా లేక ఒక ఇంటికి మరో ఇల్లు అతుక్కుని ఉంటున్నట్లుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణదారులు తమకు నెలనెల రూ.వేలలో అద్దెలు రావాలని కొంత మంది, ఫ్లాట్‌లు విక్రయించి లక్షలు వెనకేసుకోవాలని మరికొంత మంది జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీస అనుమతులు లేకుండా చేపడుతున్న సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.






