HMWSSB: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

by Ramesh Naini |

హైదరాబాద్‌ పరిధిలో పలుచోట్ల బుధవారం రోజు మంచినీటి సరఫరా నిలిపివేయనున్నారు.

HMWSSB: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ (Hyderabad) పరిధిలో పలుచోట్ల బుధవారం రోజు మంచినీటి సరఫరా (water supply) నిలిపివేయనున్నారు. హైదరాబాద్‌ నగరానికి కృష్ణా ఫేజ్-1, 2 & 3 ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాపై ఆరు గంటలపాటు అంతరాయం ఏర్పడనుంది. నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్లలో బల్క్‌ ఫీడర్ల నిర్వహణా పనులు, అలాగే దెబ్బతిన్న కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (CTs) మార్పిడి పనుల కోసం టీజీ ట్రాన్స్‌కో బుధవారం (26.11.2025) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయనుంది. విద్యుత్‌ నిలిపివేత కారణంగా కృష్ణా ఫేజ్-1, 2 & 3లకు అనుబంధంగా ఉన్న డివిజన్‌ పరిధుల్లో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం తప్పనిసరి కానుంది. కాబ‌ట్టి నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌ల‌గనున్న ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని HMWSSB అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో కోరారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..

1. ఓ అండ్ ఏం డివిజన్ నం-1: చార్మినార్

2. ఓ అండ్ ఏం డివిజన్ నం-2: వినయ్ నగర్

3. ఓ అండ్ ఏం డివిజన్ నం-3: బోజగుట్ట

4. ఓ అండ్ ఏం డివిజన్ నం-4:రెడ్ హిల్స్

5. ఓ అండ్ ఏం డివిజన్ నం-5: నారాయణ గూడ

6. ఓ అండ్ ఏం డివిజన్ నం-6:ఎస్ ఆర్ నగర్

7. ఓ అండ్ ఏం డివిజన్ నం-7:మారేడ్ పల్లి

8. ఓ అండ్ ఏం డివిజన్ నం-8: రియాసత్ నగర్

9. ఓ అండ్ ఏం డివిజన్ నం-9: కూకట్ పల్లి

10. ఓ అండ్ ఏం డివిజన్ నం-10: సాహెబ్ నగర్

11. ఓ అండ్ ఏం డివిజన్ నం-11:హయత్ నగర్

12. ఓ అండ్ ఏం డివిజన్ నం-13:సైనిక్ పురి

13. ఓ అండ్ ఏం డివిజన్ నం-14:ఉప్పల్

14. ఓ అండ్ ఏం డివిజన్ నం-15: హఫీజ్ పేట్

15. ఓ అండ్ ఏం డివిజన్ నం-16: రాజేంద్ర నగర్

16. ఓ అండ్ ఏం డివిజన్ నం-18: మణికొండ

17. ఓ అండ్ ఏం డివిజన్ నం-19: బోడుప్పల్

18. ఓ అండ్ ఏం డివిజన్ నం-20: మీర్ పేట్ డివిజన్ ప్రాంతాలు

Next Story