Alert : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

by Ramesh Naini |

12 గంటలు నగరంలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు వెల్లడించారు. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారని స్పష్టం చేశారు. అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

Alert : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ప్రజలకు జలమండలి అధికారులు అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టు ఫేజ్ - 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీని అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. దీనితో పాటు, టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు ఈ రోజు రాత్రి 8 గంటల వరకు జరుగుతాయని, కాబట్టి 12 గంటలు నగరంలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. మరమ్మతు పనులు పూర్తి చేసిన అనంతరం నీటి సరఫరా తిరిగి పునరుద్ధరిస్తారని స్పష్టం చేశారు. అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. డివిజన్–6: బంజారాహిల్స్, సోమాజిగూడ, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాలు.

2. డివిజన్–9: కేపీహెచ్‌బీ, బోరబండ, గాయత్రి నగర్, మూసాపేట్, భారత నగర్.

3. డివిజన్–15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్.

4. డివిజన్–17: గోపాల్ నగర్.

5. డివిజన్–22: తెల్లాపూర్.

జలమండలి ఉన్నతాధికారులతో ఎండీ జూమ్ మీటింగ్‌

మరమత్మల పనుల నేపథ్యంలో జలమండలి ఉన్నతాధికారులతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే అంతరాయానికి సంబంధించి ప్రతి జీఎం తన పరిధిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. ఏయే ప్రాంతాలు, ఎన్ని కనెక్షన్లు ప్రభావితమవుతాయో నివేదిక తయారు చేసుకోవాలన్నారు. దానికి అనుగుణంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడానికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. నీటి సరఫరా అంతరాయం సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు. లైన్ మెన్లు, మీటర్ రీడర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు విషయం తెలియజేయాలన్నారు. స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మేల్యేలతో మాట్లాడి వారితో సమావేశాలు నిర్వహించి నీటిని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

Next Story