- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video :మందుబాబు వీరంగం.. ఏకంగా ఫ్లై ఓవర్ మీది నుంచి జంప్
హైదరాబాద్(Hyderabad) నగరంలోని అదొక అత్యంత రద్దీ ఏరియా.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని అదొక అత్యంత రద్దీ ఏరియా. ఓ మందుబాబు ఫుల్లుగా తాగి.. ఫ్లైఓవర్ మీదుగా వెళ్తూ.. అక్కడి నుంచి కిందకి దూకాడు. . కింద ఉన్న జనం అప్రమత్తమై కాపాడటంతో ప్రాణాలతో బయట పడ్డాడు. తీరా ఆ వ్యక్తి బాగా తాగి ఉన్నాడని గ్రహించి.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలోని అత్తాపూర్(Attapur) లో జరిగింది. బాగా తాగిన మందు వీరుడు కొద్దిసేపు హంగామా సృష్టించాడు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే(PVNR Express Way) మీదకి ఎక్కి పిల్లర్ నంబర్ 100 వద్ద నుంచి అమాంతం కిందకి జంప్ చేశాడు.
అయితే అక్కడే ఉన్న టెలిఫోన్ కేబుల్స్ పట్టుకొని గాలిలో వేలాడాడు. ఇది గమనించిన స్థానికులు అక్కడే ఉన్న ఓ కారు మీది కవర్ పట్టుకోవడంతో అందులో పడిపోయాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న జనం.. పోలీసులకు సమాచారం అందించారు. తాగి రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.






