- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు : కేటీఆర్
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

దిశ, గీసుకొండ : ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మండలంలోని ఊకల్ సహకార సంఘం మక్కల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 20 రోజులైనా మక్కలకు కాంటా కావడం లేదు. ఎకరాకు 40 క్వింటాళ్లు పండిస్తే.. 26 క్వింటాళ్లే కొనడం ఏంటి? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే మండలంలో గతంలో 11 కొనుగోలు కేంద్రాలుండేవి. ఇప్పుడు రెండు కేంద్రాలే ఉన్నాయి. అక్కడా తర్పాలిన్లు, గోనె సంచులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు కల్పించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గూడెప్పాడ్‌లో ధర్నా చేస్తే కేసులు పెట్టారు. కేసులకు భయపడేది లేదు. రైతు పక్షాన నిలబడతాం. వానలొస్తే మక్కలు బూజుపట్టి నష్టపోతారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని అన్నారు.దళారుల పాలు చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. మేము తిరిగితేనే మక్కలు కొంటారని బీఆర్ఎస్ తరఫున తిరుగుతున్నాం. వెంటనే కొనుగోలు చేయకుంటే భారీ ధర్నాలు చేపడతాం. రైతులకు అండగా ఉంటాం అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.






