మ‌ద్యం సేవించిన మ‌హిళా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో హ‌ల్ చ‌ల్

by Ratna Kumari |

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో హ‌ల్ చ‌ల్ చేసిన ఘటన బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది.

మ‌ద్యం సేవించిన మ‌హిళా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో హ‌ల్ చ‌ల్
X

దిశ‌, ఖైర‌తాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో హ‌ల్ చ‌ల్ చేసిన ఘటన బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ స్టడీ సర్కిల్ వద్ద బుధవారం మిడ్ నైట్ జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువతి హల్ చల్ చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ యువతి పట్టుబడింది. పోలీసులకు సహకరించకపోగా వారితో వాగ్వాదానికి దిగింది. 'నేను బ్రీత్ అనలైజర్ ఊదను.. ఏం చేసుకుంటారో చేసుకోండి' అంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ రెచ్చిపోయింది. తన కారు కీస్ వెంటనే ఇచ్చేయ్యా లంటూ ట్రాఫిక్ పోలీసులపై కేకలు వేస్తూ హంగామా చేసింది. చివరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం.. కారును సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు.

Next Story