Hyderabad : కల్తీకల్లు ఘటన.. నిమ్స్ వైద్యుల హెల్త్ బులిటెన్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరగా.. బాధితుల సంఖ్య 22కు పెరిగింది.

Hyderabad : కల్తీకల్లు ఘటన.. నిమ్స్ వైద్యుల హెల్త్ బులిటెన్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరగా.. బాధితుల సంఖ్య 22కు పెరిగింది. శేరిలింగంపల్లిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీకల్లు(Kalthi kallu) తాగి నిన్న 15మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు నలుగురి పరిస్థితి విషమించి మరణించగా.. 22 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 20 మందికి పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా వీరి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్(NIMS Health Bulliten) విడుదల చేశారు.

నిమ్స్ ఆసుపత్రిలో కల్తీకల్లు బాధితుల్లో 20 మందికి అత్యవసర చికిత్స అందిస్తుండగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. దేవదాస్, కృష్ణయ్యకు డయాలసిస్ చేస్తున్నామని, మోనప్పను వెంటీలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మిగతా వారిని అబ్జర్వేషన్లో పెట్టామని నిమ్స్ జనరల్ మెడిసిన్ HOD డా.MVS సుబ్బలక్ష్మి వెల్లడించారు.

Next Story