Hyderabad : కల్తీ కల్లు ఘటన... 22 కు పెరిగిన బాధితులు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-09 14:20:23  IST  )

కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరగా.. బాధితుల సంఖ్య మరింత పెరిగింది.

Hyderabad : కల్తీ కల్లు ఘటన... 22 కు పెరిగిన బాధితులు
X

దిశ, వెబ్ డెస్క్ : కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరగా.. బాధితుల సంఖ్య మరింత పెరిగింది. వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీకల్లు(Kalthi kallu) తాగి నిన్న 15మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమించి మరణించగా.. బాధితుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో 22 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 15 మందికి పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటనకు కారణమైన మూడు కల్లు కాంపౌండ్‌లను సీజ్‌ చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. కల్లు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపించారు.

Next Story