- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో కల్తీ టీ పౌడర్ గుట్టు రట్టు..!
అధిక లాభాల కోసం ఓ ముఠా హైదరాబాద్ నగర వాసులను ప్రమాదకరమైన వ్యాధుల ఊబిలోకి నెట్టేస్తున్నారు.

దిశ, సిటీ క్రైం : అధిక లాభాల కోసం ఓ ముఠా హైదరాబాద్ నగర వాసులను ప్రమాదకరమైన వ్యాధుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. కల్తీ టీ పౌడర్ ను తయారు చేసి బ్రాండెడ్ కంపెనీ టీ ప్యాకేట్ లలో మార్కెట్ లోకి వదులుతున్నారు. కొన్నేండ్ల నుంచి సాగుతున్న ఈ నకిలీ దందా పై హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం) పోలీసులు గురువారం ఏకకాలంలో 15 చోట్ల సోదాలు జరిపి కల్తీ దందాకు చెక్ పెట్టారు. హెచ్ ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం..హైదరాబాద్ కొంపల్లి, బోయిన్ పల్లి, మల్లేపల్లి, పేట్ల బుర్జు, ముషీరాబాద్ ప్రాంతాలకు చెందిన పరేష్ రాజన్, సతీష్, నవీన్, నర్శింహ, నరసింహులు, చున్నిలాల్ చౌదరీ, రాజేష్, రవీందర్, వసీంలు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. వీరు కోలకత్తా, అస్సొం, కేరళ నుంచి నాణ్యత తక్కువగా ఉన్న టీ పౌడర్, వాడేసిన టీ పౌడర్ , గడువు తీరిన టీ పౌడర్ లను సేకరిస్తు్న్నారు.
వీటికి బెల్లం పాకంతో పాటు సింథటిక్ కలర్లైన సన్ సెట్ యెల్లో-ఎఫ్సీఎఫ్, టార్ట్రాజైన్ రంగులను కలిపి కల్తీ టీ పౌడర్ ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన టీ పౌడర్ ను బ్రాండెడ్ టీ పౌడర్ ప్యాకెట్ లలో రీ ప్యాకింగ్ చేసి వాటిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాల్ లతో పాటు ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇలా వీరు గత కొంత కాలంగా ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ టీ పౌడర్ తాగడం వల్ల దీర్ఘాకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సోదాల్లో పోలీసులు 3 వేల కిలోల కల్తీ టీ పౌడర్, 100 కిలోల బెల్లం, 1500 కిలోల గడువు తీరిన టీ పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర ప్రజలు వస్తువులను గుర్తింపు పొందిన దుకాణాల నుంచి కొనుగొలు చేయాలని కోరుతున్నారు. కల్తీకి సంబంధించి అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 లేదా హెచ్ ఫాస్ట్ నెంబరు 8712661212 ఫిర్యాదు, సమాచారం ఇవ్వాలని విజ్ణప్తి చేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను డీసీపీ అభినందించారు.






