- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు షురూ..!
లక్డికాపూల్ లోని ఆసిఫ్ నగర్ తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల గర్ల్స్- 1 లో అడ్మిషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ జావీద్ హాజరై విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో అడ్మిషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

దిశ, కార్వాన్ : లక్డికాపూల్ లోని ఆసిఫ్ నగర్ తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల గర్ల్స్- 1 లో అడ్మిషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ జావీద్ హాజరై విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో అడ్మిషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జావిద్ మాట్లాడుతూ.. నేటి తరంలో మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో పోటీ పడుతూ పై చేయి సాధిస్తున్నారని, ప్రతి మైనారిటీ ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులు మైనార్టీ ఆడపిల్లలను గురుకులాల్లో చేర్పించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రిన్సిపల్ వాజిదా మాట్లాడుతూ.. అందరికీ విద్య అనే దృక్పథంతో నిరుపేదలకు సైతం నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రారంభమైన మా గురుకుల పాఠశాలలు అందరికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. గత ఆరు సంవత్సరాల నుంచి వరుసగా 100% ఉత్తీర్ణత సాధించిన ఘనత మా ఆసిఫ్ నగర్ గర్ల్స్-1 పాఠశాలకే దక్కిందన్నారు. మా పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా జాతీయస్థాయిలో వివిధ పథకాలను సాధించి పాఠశాలకే మంచి పేరు తెచ్చారని తెలిపారు. ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి సౌకర్యాలతో చక్కని వాతావరణంలో తల్లిదండ్రులను మరిపించే ఉపాధ్యాయుల ప్రేమ ఆదరణల మధ్య నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఒక్క ఆధార్ కార్డు చేత పట్టుకొని పాఠశాల ప్రవేశం చేస్తే, ఒక స్కాలర్ గా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుత పోటీ తత్వాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు నీట్, ఐఐటీ, జేఈఈ , ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సైతం ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందానికి అవకాశాన్ని కల్పించిన సెక్రటరీ షఫీ ఉల్లా కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అడ్మిషన్స్ కొరకు పాఠశాల ఫోన్ నెంబర్ 7995057986, 9966620330, 8125485698 లను సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో నిర్వాహకురాలు ఆయేషా, మత పెద్దలు ముఫ్తి సుల్తాన్, ముబారక్ పాల్గొన్నారు.






