- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ లేని ఆహారం కోసం అందరూ వెతుకుతున్నారు : నటుడు సోనూ సూద్
కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలు మారిపోయాయని, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కల్తీ లేని ఆహార పదార్థాల కోసం వెతుకుతూనే ఉన్నారని నటుడు సోనూ సూద్ అన్నారు.

దిశ, ఖైరతాబాద్ : కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలు మారిపోయాయని, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కల్తీ లేని ఆహార పదార్థాల కోసం వెతుకుతూనే ఉన్నారని నటుడు సోనూ సూద్ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఆశ్య ఫుడ్స్ ఉత్పత్తుల ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు తాను ముందు నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని, నాణ్యమైన ఉత్పత్తులు ఉన్నాయంటే దేశంలో ఎక్కడినుంచైనా తాను తెప్పించుకుంటానని తెలిపారు. రైతుల దగ్గరి నుంచి మార్కెట్‌కు వచ్చే సరికి ఆ ఉత్పత్తుల్లో ఎన్నో మార్పులు జరిగి నకిలీవి తయారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆశ్య ఫుడ్స్ అధినేత శశిధర్‌రెడ్డి రూపొందించిన పసుపు, మిరియాలు, కారం, కినోవా తదితర ఆరు రకాల ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ హర్షిత వెలివాల, జాతీయ పసుపు బోర్డు సెక్రటరి, ఐఏఎస్ భవానీ శ్రీ, పద్మశ్రీ మంజుల అనగాని, హైకోర్టు జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి, కజికిస్తాన్ గౌరవ డాక్టర్ కౌన్సిల్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఐపీఎస్ రాజీవ్ త్రివేది, ఏఐసీసీ సెక్రటరి సంపత్‌కుమార్, బీఆర్‌ఎస్ నేత పటోళ్ళ కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు.






