- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉద్ధేశపూర్వకంగా తప్పుడు వార్తలను సృష్టిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ను కోరారు.

ఫేక్ వార్తలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలి
– రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి
– ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు
దిశ, వనస్థలిపురం: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉద్ధేశపూర్వకంగా తప్పుడు వార్తలను సృష్టిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ను కోరారు. సోమవారం ఎల్బీనగర్ లోని డీసీపీ ఆఫీస్ లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో ఓ భూ సమస్యకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి పై తప్పుడు వార్తలు సృష్టిస్తూ... సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ సోషల్ మీడియా మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కీసరలో భూ సమస్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫేక్ వార్తలు వ్యాప్తి చేస్తూ.. తమ పరువుకు భంగం కలిగిస్తున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లు చెప్పారు.






