- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏండ్ల జైలు శిక్ష
పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కఠిన శిక్ష విధించింది.

దిశ, చైతన్యపురి: పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కఠిన శిక్ష విధించింది. బాలికపై నేరానికి పాల్పడిన కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 396/2023 కేసులో ఈ తీర్పు వచ్చింది. కేసు వివరాల ప్రకారం.. ఐపీసీ సెక్షన్లు 363, 376తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 3 r/w 4 కింద రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం మాల్దొడ్డి గ్రామానికి చెందిన మీసాల బాబన్న అలియాస్ బాబు (23)పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. అనంతరం అతడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.1,00,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సత్యనారాయణ వాదనలు వినిపించినట్లు సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం తెలిపారు. నేరస్తులకు చట్టపరంగా శిక్షలు పడేలా పోలీసులు, న్యాయశాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.






