- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rangarajan Attack Case : రంగరాజన్ పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ
చిలుకూరు బాలాజీ ఆలయ(Chilukuru Balaji Temple) ప్రధాన పూజారి రంగరాజన్(Rangarajan) పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : చిలుకూరు బాలాజీ ఆలయ(Chilukuru Balaji Temple) ప్రధాన పూజారి రంగరాజన్(Rangarajan) పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీర రాఘవ రెడ్డి(Veera Raghava Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నేడు రాజేంద్రనగర్ కోర్టులో వీర రాఘవ రెడ్డిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని మొయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీకి ఇవ్వకూడదని నిందితుడి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్.. ఇరువైపులా వాదనలు విని.. రేపటి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. మరోవైపు నిందితుడికి బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది.
అయితే ఇటీవల "రామరాజ్యం సైన్యం" పేరుతో వీర రాఘవ రెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్ళి.. తనకు చందా ఇవ్వడంతోపాటు తన ఆర్మీకి సపోర్ట్ చేయాలని ఆయనపై దాడి చేశాడు. దీనిపై మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపగా.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, పలు హిందూ ధార్మిక సంస్థలు రంగరాజన్ ను పరామర్శించి, మద్దతు తెలియ జేశారు. ఇక ఈ దాడి కేసులో ప్రధాన నిండుతుడితోపాటు ఆయన అనుచరులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మొయినాబాద్ పోలీసులు.






