'శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన మనసును కలిచివేసింది'

by Nallavelli.Anjaneyulu |

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన మనసును కలిచివేసిందని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ అన్నారు.

శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన మనసును కలిచివేసింది
X

దిశ, హిమాయత్ నగర్ : నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన మనసును కలిచివేసిందని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ అన్నారు. ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కార్మికుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న తాండూరులో పోలీసులు అత్యుత్సాహంతో ఒక నోటీసు విడుదల చేసి, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎటువంటి మద్దతు ఇవ్వవద్దని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసిందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదని, అలాంటి చర్యలకు దిగితే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒత్తిళ్లు, బెదిరింపులు కార్మికులను మానసికంగా దెబ్బతీసి నేడు నర్సంపేటలో జరిగిన విషాద ఘటనకు దారి తీశాయని ఆరోపించారు. ఈ పరిస్థితులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Next Story