తాగిన మత్తులో యువకుడి వీరంగం

by Ratna Kumari |

తాగిన మత్తులో వైన్స్​ వద్ద వీరంగం సృష్టించి , పోలీస్​ స్టేషన్​లో కానిస్టేబుల్​పై దాడి చేసిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

తాగిన మత్తులో యువకుడి వీరంగం
X

దిశ, వనస్థలిపురం : తాగిన మత్తులో వైన్స్​ వద్ద వీరంగం సృష్టించి , పోలీస్​ స్టేషన్​లో కానిస్టేబుల్​పై దాడి చేసిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఇన్​స్పెక్టర్​ మహేశ్ తెలిపిన‌​ వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని పనామా ప్రాంతంలో ఉండే ప్రైవేట్​ ఉద్యోగి దెంది కార్తీక్​రెడ్డి (27) సోమవారం రాత్రి సమీపంలోని డైమండ్​ వైన్స్​ వద్ద మ‌ద్యం సేవించాడు. వేరే వారితో గొడవ పడటంతో న్యూసెన్స్ చేస్తున్నాడని స్థానికులు 100కు డయల్​ చేయగా.. పోలీసులు వెళ్లి స్టేషన్​కు తీసుకువచ్చారు. స్టేషన్​కు వచ్చినప్పటి నుంచి కార్తీక్​రెడ్డి అక్కడికి వచ్చిన పబ్లిక్ ని, డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ మళ్లీ న్యూసెన్స్​ చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నైట్​ వాచ్ డ్యూటీలో కానిస్టేబుల్ యాదగిరి అడుగుతుండగా.. ఒక్కసారిగా తలతో కానిస్టేబుల్ తలపై బలంగా గుద్దాడు. సదరు కానిస్టేబుల్ తలకి బలమైన గాయమై రక్తస్రావమైంది. కానిస్టేబుల్ యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే వైన్స్ లో జరిగిన గొడవలో కార్తీక్​రెడ్డి తనపై దాడి చేశారని కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కార్తీక్ రెడ్డి, మరికొంతమందిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు సీఐ తెలిపారు.

Next Story