- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, మియాపూర్ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా చామదాల గ్రామానికి చెందిన వల్లెపు వెంకటేష్ నగరంలోని మియాపూర్ టాకీ టౌన్ సమీపంలో కొంత కాలంగా నివాసముంటూ ఇసుక వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని దురాశతో చోరీలకు తెరలేపాడు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గృహాలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతూ వెండి, బంగారు ఆభరణాలను కాజేస్తున్నాడు.
మియాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, బాచుపల్లి, చందానగర్ ఆర్ సి పూర్, బాలానగర్ సహా పలు పోలీసు స్టేషన్ల పరిధిలో 45 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. తాజాగా మియాపూర్ మాతృ శ్రీ లో ఇదే తరహాలో చోరీ పై కేసు నమోదు చేసిన పోలీస్ లు సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం మయూరి నగర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా గుర్తించి మియాపూర్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేష్ నుంచి 607 గ్రాముల వెండి ఆభరణాలు 4 గ్రాముల బంగారం ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితుడిని పట్టుకోడంలో చాకచక్యంగా వ్యవహరించిన మియాపూర్ పోలీస్ సిబ్బందిని డీసీపీ రితిరాజ్ అభినందించి రివార్డులను అందజేశారు. ఈ సమావేశం లో ఏసీపీ రవికిరణ్ రెడ్డి, సీఐ శివప్రసాద్, డీఐ రమేష్ నాయుడు ఉన్నారు.






