- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లండన్ లో తెలుగు విద్యార్థికి ఘోర అవమానం
లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్ ఫోర్డ్‌షైర్ లో ఎం.ఎస్. చేసేందుకు ఈ జనవరిలో వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ప్రసాద్ రెడ్డికి ఘోర అవమానం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దిశ, రవీంద్ర భారతి : లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్ ఫోర్డ్‌షైర్ లో ఎం.ఎస్. చేసేందుకు ఈ జనవరిలో వెళ్లిన హైదరాబాద్ కు చెందిన ప్రసాద్ రెడ్డికి ఘోర అవమానం జరిగిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. జనవరి 30న యూనివర్సిటీ యాజమాన్యంతో అకామిడేషన్ విషయం పై మాట్లాడుతుండగా అక్కడ అధికారులు విద్యార్థి ప్రసాద్ రెడ్డి (స్టూడెంట్ ఐడి 25050957)ని తీవ్రంగా అవమానించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ బెగ్గర్, యూస్ లెస్ ఫెల్లో అంటూ అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు. ఆ విద్యార్థిని బలవంతంగా ఇండియాకి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై యూనివర్సిటీ ఉన్నత అధికారులకు పలుమార్లు పిర్యాదు చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయిందన్నారు.
విద్యార్థి ప్రసాద్ రెడ్డి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక మానసిక వేదనతో ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యుల సహాయంతో ఇండియాకి వచ్చాక కూడా స్ట్రెస్ వల్ల ప్రసాద్ రెడ్డి బ్రెయిన్ సంబంధించిన వ్యాధితో ఆసుపత్రి పాలైనట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. భవిషత్తుల్ ప్రసాద్ రెడ్డి విద్యాపరంగా ముందుకు రాణించలేరని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆల్ ఇండియా విద్యార్థి సంఘాల నేతలు దేశంలో విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్ విశ్వ విద్యాలయంతో ఎటువంటి అనుసంధానం, అవగాహన ఒప్పందాలు చేసుకోకూడదని.. అక్కడికి తెలుగు విద్యార్థులను, భారతీయులను కూడా పంపకూడదని కోరారు.






