- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మే 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించనున్న డాక్టర్ల బృందం..
ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించేందుకు ఇద్దరు డాక్టర్లతో కూడిన బృందం మే6వ తేదీన నగరం నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, అంబర్ పేట్ : ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించేందుకు ఇద్దరు డాక్టర్లతో కూడిన బృందం మే6వ తేదీన నగరం నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. (71) సంవత్సరాల వయసుగల వరల్డ్ రికార్డు హోల్డర్ డాక్టర్ ఏ. కృష్ణారెడ్డి, (67) సంవత్సరాల వయసుగల మిస్సెస్ ఇండియా అవార్డు గ్రహీత డాక్టర్ నక్కన శోబాదేవీలు ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సోమవారం కాచిగూడలో వారు విలేకరులతో మాట్లాడుతూ జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుననే సందేశాన్ని నేటి యువతరానికి అందించాలనే ఉద్దేశంతో ఎవరెస్ట్ బేస్ ను అధిరోహించేందుకు పూనుకున్నామన్నారు. ఏదైనా సాధించడానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించనున్నామన్నారు. మహిళలు, వృద్ధులు ఎందులోనూ తీసిపోరనే విధంగా అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక చరిత్రను సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.






