- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9 వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..
by Taduka Kalyani |
భవనంలోని 9 వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, మియాపూర్: భవనంలోని 9 వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణానికి చెందిన మోతే నరేందర్ గౌడ్, లతలు మియాపూర్ లోని నీలిమ హైట్స్ లో గత 8 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.
వారి కూతురు మోతే రేణుక (19), గోకరాజు రంగరాజు కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వారు ఉంటున్న భవనంలోని 9 అంతస్తుకు వెళ్లి అక్కడనుంచి కిందికి దూకింది. దీంతో తల పగలడంతో అక్కడికక్కేడే మరణించింది. కాగా రేణుక మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం. తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






