- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో నయా ట్రెండ్ ... ఏకంగా దుర్గం చెరువు సాక్షిగా
సింగిల్స్.. మింగిల్స్ పార్టీలు అనేవి ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఈ పార్టీలకు హాజరయ్యే వారు అందరూ కొత్తవా రే..

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ ఇప్పుడు మెట్రో సిటీగా మారిపోయింది. దినదినాభివృద్ది చెందుతూ కొత్త కొత్త సొగసులు అద్దుకుంటుంది. అంతేవేగంగా పాశ్చాత్య సంసృతిని ఒంటబట్టించుకుంటుంది. హైదరాబాద్ నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటు, విదేశీయులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటారు. ఇక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. ఐటీ, పర్యాటక రంగాలు అభి వృద్ధి చెందాక ఇక్కడ పబ్ కల్చర్, కో లివింగ్, ఎక్స్చేం జింగ్, స్వాపింగ్, సింగిల్స్, మింగిల్స్ ఇలా అనేక విదేశీ దోరణలు వచ్చి చేరాయి. వాటిని మన యువత కూడా త్వరగానే వంటబట్టించుకుని.. అంతకంటే వేగం గా, వా రికంటే ముందే పరిగెడుతున్నారు. అందులో ఒక టి సిం గిల్స్.. మింగిల్స్ పార్టీలు. ఇప్పటి వరకు పబ్ కల్చర్ కు మాత్రమే పరిమితమైన వారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సింగిల్స్..మింగిల్స్ అంటూ కొత్తరాగం అందుకున్నారు.
ఆన్ లైన్ బుకింగ్, వాట్సప్, టెలిగ్రామ్ ఛాటింగ్..
ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీల కోసం ప్రత్యేకంగా కొ న్ని యాప్ లే నడిపిస్తున్నారు. ఆ యాప్ లోకి ఎంటర్ అ యి మీరు ఏ ఏరియాలో, ఏ పార్టీకి ఇంట్రెస్ట్ గా ఉన్నారో చెబితే చాలు. అందులో రేట్ కార్డు ప్రత్యక్షం అవుతుంది. దాన్ని బట్టి మీరు సెలక్ట్ చేసుకోవచ్చు. పార్టీ ప్లేస్, అక్కడ లభించే సౌకర్యాలు, మీరు కోరుకుంటున్న వసతులు ఇలా అన్నీ మీ ఫోన్ కు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. అక్కడికి వెళ్లాక తర్వాతి సెషన్స్ సాగుతుంటాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అం తా స్ట్రేంజర్స్, ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. కొంత సమయం కేటాయిస్తారు. అందులోనే మీకు నచ్చిన అమ్మాయితో లేదా అబ్బాయితో మాట కలిపి వారితో మీకు ఓకే అంటే నెంబర్లు మార్చుకుని మింగిల్స్ గా మారవచ్చు. ఇటీవల దుర్గం చెరువు వద్ద సాగిన సింగిల్స్ మింగిల్స్ పార్టీలో యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఒకరికి ఒకరు తెలియదు.. అంతా కొత్తవారే
సింగిల్స్.. మింగిల్స్ పార్టీలు అనేవి ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఈ పార్టీలకు హాజరయ్యే వారు అందరూ కొత్తవా రే.. కనీసం ఒకరికి ఒకరు పరిచయం కూడా ఉండరు. కొత్తకొత్త వారిని ఓ పబ్ లో లేదా మరోచోటికి పిలిచి పార్టీ ఏర్పాటు చేస్తారు. ఈ పార్టీకి హాజరు అయ్యేవారి వ యస్సు 22 నుండి 44 సంవత్సరాల లోపు ఉండాలి. అ లా అయితేనే ఇందులోకి ఎంట్రీ ఉంటుంది. ఈ పార్టీకి అటెండ్ అయ్యే అమ్మాయిలకు ఒక ఫీజ్.. అబ్బాయిలకు అంతకు డబుల్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పార్టీ లో మిగతా ఖర్చులు వేరే.. ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీ లో గానా భజాన, మందు, విందు అన్నీ ఉంటాయి.
నగర వ్యాప్తంగా నయా ట్రెండ్
సింగిల్స్.. మింగిల్స్ పార్టీలు అనేవి ఏ ఒక్క ప్రాం తానికి పరిమితం కాలేదు. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ఎక్కువగా కనిపిస్తున్నా.. సికింద్రాబాద్, రామాంతపూర్, సైనిక్ పురి, సన్ సిటీ, బండ్లగూడ జాగీర్, శంషాబాద్, మెహదీపట్నం, ఎన్బీటీ నగర్, రాం కోటీ ఇలా నగరం నలుమూలల ఈ సింగిల్స్ మింగిల్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇందు కు సంబంధించి డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్లు ఆన్ లైన్ లోనే ఉంటున్నాయి. ఏ రోజు ఎక్కడ పార్టీ ఉంటుంది. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది అనే డిటెయిల్స్ వివరిస్తున్నారు. అన్నీ తెలిసినా సంబంధిత వర్గాలు, పోలీసులు ఎందుకో ఇలాంటి వాటిని చూసీచూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది. టికెట్లు పెట్టి పార్టీలు నిర్వహించినప్పుడు విధిగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తాజాగా దుర్గం చెరువు వద్ద సాగిన సింగిల్స్.. మింగిల్స్ పార్టీలో నిర్వాహకులు అలాంటివి నిబంధనలు ఏమీ పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.






