Police Department : పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసిన సెక్యూరిటీ గార్డ్..

by Batti.Sumithra |

పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి అందులోని 6 లక్షల 79 వేల రూపాయల నగదును అపారించకపోయి కటకటాల పాలైన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Police Department : పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసిన సెక్యూరిటీ గార్డ్..
X

దిశ, ఎల్బీనగర్ : పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి అందులోని 6 లక్షల 79 వేల రూపాయల నగదును అపారించకపోయి కటకటాల పాలైన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన మిత్తిలేష్ కుమార్ వనస్థలిపురం వైదేహి నగర్ లోని నారాయణ పాఠశాలలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి సమయంలో అల్మరా పగలగొట్టి అందులోని 6,79,500 దొంగిలించి తన సొంత రాష్ట్రమైన బీహార్ కు వెళ్లిపోయాడు.

మరుసటి రోజు నారాయణ స్కూల్ సిబ్బంది బీరువా తెరిచి చూడగా అందులో ఉన్న నగదు కనిపించకపోవడంతో పాఠశాలకు చెందిన రఘునాథ్ రెడ్డి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పూర్తివివరాలు సేకరించిన పోలీసులు ఇందులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు పై అనుమానం వచ్చి అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను బీరువా పగలగొట్టి అందులోనే నగదును తస్కరించాలని ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Next Story