‘ఏకశిల’ పేరుతో దందా!

by Elthuri vijay kumar |

ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్య పేరిట జరుగుతున్న దోపిడీ మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పేట్రేగిపోయిన ఎడ్యుకేషన్ మాఫియా ప్రస్తుత ప్రజాపాలనలోనూ డోంట్ కేర్ అంటోంది.

‘ఏకశిల’ పేరుతో దందా!
X

‘ఏకశిల’ పేరుతో దందా!

– రూ. లక్షల్లో ఫీజులు.. వేలల్లో జరిమానాలు?

– హయత్ నగర్ ఎంఈవోకు బాధితుల ఫిర్యాదు

– పట్టించుకోని ఎంఈవో తీరుపై అనుమానాలు?

– ఫీజు పేరుతో వేధింపులకు ఓ పేరెంట్ఆత్మహత్యాయత్నం?

దిశ, వనస్థలిపురం: ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్య పేరిట జరుగుతున్న దోపిడీ మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పేట్రేగిపోయిన ఎడ్యుకేషన్ మాఫియా ప్రస్తుత ప్రజాపాలనలోనూ డోంట్ కేర్ అంటోంది. అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా స్కూళ్ల పేర్లను మార్చేసి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ.. ఫీజులు చెల్లించడంలో తల్లిదండ్రులు ఆలస్యం చేస్తున్నారంటూ అమాయక చిన్నారులకు పరీక్షలు నిర్వహించకుండా.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. చేసేదేమి లేక మీ ‘ఫీజులు కట్టలేం మహా ప్రభో .. మా పిల్లల టీసీలు మాకు ఇవ్వండి అంటూ తల్లిదండ్రులు మొర పెట్టుకున్నా.. టర్మ్ ఫీజు చెల్లిస్తేనే టీసీ.. అంటూ తెగేసి చెప్పడంతో ఇటీవల బాధితులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో పట్టించుకోకపోవడంతో తన పిల్లల చదువులు ఆగిపోతున్నాయని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. స్కూల్ యాజమాన్యంపై అకడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి ఎంఈవోకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖ అధికారి తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నా.. కార్పొరేట్ మాఫియా దోపిడీని నియంత్రించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే హయత్ నగర్ ప్రియదర్శిని కాలనీలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ‘సెయింట్ జోసెఫ్ స్కూల్ ’ ‘అండర్ఏకశిల మేనేజ్మెంట్’ తో నడుపుతున్న యాజమాన్యం ఫీజులుం చూస్తుంటే.. కార్పొరేట్ విద్య పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేది ఎవరు? అనేది ప్రశ్నార్థకంగానే మారింది.

పేరెంట్తల్లి ఆత్మహత్యాయత్నం?

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి, క్షేత్ర స్థాయిలో అధికారుల అలసత్వం, ప్రైవేట్మేనేజ్మెంట్లకు వరంగా మారగా.. తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా మారింది. ‘సెయింట్ జోసెప్స్ స్కూల్ ’ ‘అండర్ ఏకశిల మేనేజ్మెంట్’ యాజమాన్యం టర్మ్ ఫీజు కట్టలేదని చిన్నారులకు పార్మెటివ్ అసెస్మెంట్ లాంటి పరీక్షలు నిర్వహించకుండా మానసిక వేధింపులకు గురిచేయడంతో, టీసీలు అడిగినందుకు మొత్తం ఫీజులు కట్టాలని వేధించడంతో బాధితులు శనివారం ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో , స్కూల్ ప్రిన్సిపాల్ టీసీ ఇవ్వకుండా స్కూల్నుంచి పోలీసులను పెట్టి గెంటివేయించడంతో సోమవారం పేరెంట్ తల్లి రాణి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది.

ఎవరైనా సరే డోంట్ కేర్ : ప్రిన్సిపాల్

ఎంఈవోకు ఫిర్యాదు చేసిన అనంతరం సోమవారం బాధితురాలు తమ పిల్లల టీసీలు ఇవ్వాలని విద్యార్థి సంఘం నాయకుడితో కలిసి స్కూల్కు వెళ్లింది. ఏ మాత్రం తగ్గేదేలే .. అన్నట్లుగా .. స్కూల్ ప్రిన్సిపాల్ వైట్ పేపర్ పై ఫీజు వేసి ఇది చెల్లించాలని మళ్లీ పునరావృతం చేసింది. ఇంత అన్యాయమా అని ఆందోళనకు దిగితే ‘ఎంఈవో చెప్తే వింటామా? ’ అంటూ పోలీసులను పిలిపించింది. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి . డోంట్ కేర్.. అంటూ.. పేట్రేగి పోయినట్లు బాధితురాలు వాపోయింది.

ఎంఈవో తీరుపై అనుమానాలు..

అకడమిక్ ఇయర్ ప్రారంభమై 3 నెలలు అవుతున్నా.. ‘ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచారు. పర్మిషన్లేని స్కూల్పేరును ఇష్టారాజ్యంగా వాడుతూ ‘ ఏకశిల’ .. సీబీఎస్ఈ కరిక్యులం పేరుతో డబుల్ఫీజులు వసూలు చేస్తున్నారు. బుక్స్, యూనిఫామ్స్యథేచ్ఛగా అమ్ముతున్నారు’ అని ఫిర్యాదు చేసినా.. ఎంఈవో ఎలాంటి చర్యలు తీసుకోక పోగా.. ‘నోటీసులు ఇచ్చాం. డీఈవో చూసుకుంటారు ’ అంటూ దాటవేత సమాధానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రశ్నించిన వారిపై చిర్రుబుర్రులాడుతూ.. ‘సెయింట్ జోసెప్ స్కూల్ కు ఏకశిల పేరు పెట్టుకుంటే తప్పేంటి’? .. నీకేం అభ్యంతరం అంటూ .. నిర్ల్యక్షం సమాధానం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

డీఈవో ఫోకస్ చేయాలని డిమాండ్

ఏదేమైనా హయత్ నగర్ మండలంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ఫీజుల పేరుతో వేధిస్తూ.. చిన్నారులు, తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్న అండర్ ఏకశిల ‘సెయింట్జోసెఫ్స్’ పేరుతో నడస్తున్న స్కూల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గణేశ్ డిమాండ్చేశారు. జిల్లాలో పర్మిషన్లేని ‘ఏకశిల’ బోర్డులను తొలగించి ప్రజలను మోసం చేయకుండా చూడాలని కోరారు. డీఈవో స్పందించకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Next Story