- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
అతను చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. దొంగతనాల బాట పట్టాడు.

దిశ, శేరిలింగంపల్లి : అతను చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. దొంగతనాల బాట పట్టాడు. వరస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. శేర్లింగంపల్లి జోన్ క్రైమ్ టీమ్, అమీన్ పూర్ పోలీసులతో కలిసి నిఘా ఏర్పాటు చేశారు. అంతర్-జిల్లా నేరస్తుడిని సైబరాబాద్ పరిధిలోని అమీన్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం..నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, రామ్ నాయక్ తండాకు చెందిన ఎర్ర శివ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ, భూపేష్ గుప్తా కాలనీ నివాసం ఉంటున్నాడు. నిందితుడు ఎర్ర శివ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి తాపీ మేస్త్రీ వద్ద కూలీగా పని చేసేవాడు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేయడం.. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ ఇనుప రాడ్‌తో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడేవాడు. ఇటీవలి కాలంలో అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను వరస ప్రధాన దొంగతనాలకు పాల్పడ్డాడు. మండ్ల శివ అలియాస్ ఎర్ర శివ (32) గా గుర్తించారు. ఈ మధ్య కాలంలోనే అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతను వరస దొంగతనాలకు పాల్పడ్డాడు. గండి గూడెం, బందంకొమ్ము బీరంగూడా ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. అల్మారాను పగలగొట్టి విలువైన వాచీలు, కొంత నగదును అపహరించాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి అతని వద్ద నుండి 50 తులాల బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన నగలు, 5వేల నగదు చోరీ చేశాడు. చోరికి ఉపయోగించిన ఒక స్కూటర్, ఇనుప రాడ్ నుస్వాదీనం చేసుకున్నామని శేరిలింగంపల్లి జోన్ డీసీపీ తెలిపారు. నిందితుడు గతంలో మల్కాజ్ గిరి, సైబరాబాద్ కమిషనరేట్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో దాదాపు 24 చోరీల్లో ఇతని ప్రమేయం ఉంది. దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడని వివరించారు.






