గొర్రెల కోసం వెళ్లి నాలాలో పడిపోయిన వ్యక్తి

by Muthe.Rajitha |

గొర్రెల మేత కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు.

గొర్రెల కోసం వెళ్లి నాలాలో పడిపోయిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్ : గొర్రెల మేత కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. సమయానికి అటుగా వెళ్తున్న కార్పొరేటర్ తాడు అందించి కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా పాతబస్తీలో గౌస్ అనే వ్యక్తి తను పెంచుతున్న గొర్రెల కోసం ఆకులు తెంపడానికి వెళ్లి అనుకోకుండా నాలాలో పడిపోయాడు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ క్వాద్రి దానిని గమనించి నిచ్చెన, తాడు సహాయంతో రక్షించారు. యాకుత్‌పురా స్టేషన్ నుండి చౌనీ వరకు ప్రవహిస్తున్న నాలా వెంట చెట్లు, తీగలు ఎక్కువగా ఉండటంతో వాటికోసం గౌస్ వెళ్ళినపుడు ఈ ఘటన జరిగింది.

సమాచారం అందిన వెంటనే యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో కార్పొరేటర్ చొరవను, ఎమ్మెల్యే సహకారాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. అయితే స్థానికులే రెస్క్యూ చేసి వ్యక్తిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అయింది.

Next Story