విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

by Ratna Kumari |

మియాపూర్ హఫీజ్ పేట్ లో ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు.

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం
X

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ హఫీజ్ పేట్ లో ఉద్యోగాల పేరుతో కేటుగాళ్లు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. ఒక్కో వ్యక్తి వద్ద నుంచి ఆరు లక్షల చొప్పున వసూలు చేశారు. అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ పేట్ లోని సి.డి.దశరథ్ క‌న్స‌ల్టెన్సీ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రకటన చూసిన చాలా మంది నిరుద్యోగులు హఫీజ్ పేట్కార్యాలయంలో సంప్రదించారు. ఒక్కొక్కరు రూ.6 లక్షల చొప్పున చెల్లిస్తే వీసా ట్రావెల్స్ అంత మేము ఏర్పాటు చేస్తామంటూ నమ్మించారు. అదును చూసి బోర్డు తిప్పేసారు. సుమారు 90 మంది నిరుద్యోగుల నుంచి రూ. 5కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులు అర్చన ప్రియ, సోమశేఖర్,రాజేంద్రప్రసాద్ ల పై బాధితులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈజిప్ట్, ఇజ్రాయల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈజిప్ట్ వరకు తీసుకెళ్లిన కేటుగాళ్లు.. అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితులు ఖంగు తిన్నారు. చేసేదేమీ లేక సొంత ఖర్చులతో వెనుతిరిగి నగరానికి చేరుకున్నారు. హఫీజ్ పేట్ లోని ఆఫీస్ మూతపడడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.

Next Story