గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు..

by Disha Web Desk 20 |
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు..
X

దిశ, చందానగర్ : గుట్టుచప్పుడు కాకుండా ఓ గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ లోని నాగార్జున హైస్కూల్ సమీపంలో డబల్ బెడ్ రూం పోర్షన్ ను నిందితులు అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి తనిఖీ చేయగా పోలీసులను చూసి తప్పించుకొనే ప్రయత్నం చేయగా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించారు. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులు ఎండీ సర్వర్, అక్లిమా బీబీ, మినారుల్ షేక్, బాగిరత్ పాస్వాలను సోమవారం కోర్టులో హాజరు పరిచారు.

Next Story

Most Viewed