బ్రేకింగ్: కోఠిలో అగ్ని ప్రమాదం.. షాపుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

by Satheesh |   (  Updated:2023-06-06 05:14:49  IST  )

వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసుకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

బ్రేకింగ్: కోఠిలో అగ్ని ప్రమాదం.. షాపుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఎల్బీ నగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మరువకముందే నగరంలో తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం నగరంలోని కోఠి డీహెచ్ఎమ్మెస్ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మూసివున్న షాపుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Next Story