- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం మత్తులో గొడవ.. చివరికి జరిగింది ఇదే!
by Naveena |
మద్యం మత్తులో గొడవ పడి ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ,కార్వాన్ : మద్యం మత్తులో గొడవ పడి ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోల్కొండలోని అట్టార సిడి ప్రాంతానికి చెందిన మహమ్మద్ మఖిద్(20) ,మహమ్మద్ సమీర్ ఇద్దరు బావ బామ్మర్దులు. కాగా శనివారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశానికి గురైన మహమ్మద్ సమీర్ బ్లేడుతో మహమ్మద్ ముఖిద్ ఛాతిపై దాడి చేయడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున మృతుడి కుటుంబ సభ్యులు గోల్కొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ,కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలిసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






