దగ్ధమైన పామాయిల్ తోట

by Ratna Kumari |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం శివారులో నూనావత్ బిక్కు కు చెందిన నాలుగు ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా దగ్ధం అయింది.

దగ్ధమైన పామాయిల్ తోట
X

దిశ, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం శివారులో నూనావత్ బిక్కు కు చెందిన నాలుగు ఎకరాల పామాయిల్ తోట పూర్తిగా దగ్ధం అయింది. వివరాల్లోకి వెళితే.. రాయపర్తి మండలం సూర్య తండాకు చెందిన రైతు బిక్కుకు పర్వతగిరి మండలం అన్నారం శివారులో పామాయిల్ తోట ఉంది. ఆదివారం అన్నారం గ్రామానికి చెందిన రైతు గొడుగు సారయ్యకు చెందిన మొక్కజొన్న చేనులో ఏర్పడినటువంటి మంటలు వేగంగా సుమారు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించాయి. వేగంగా వ్యాపించిన మంటలతో పామాయిల్ తోటలోని 215 చెట్లు డ్రిప్ పైపులు, స్టార్టర్ మోటర్లతో సహా బిందు సేద్యం పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో రైతుకు సుమారు ఐదు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వపరంగా ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు నూనావత్ బిక్కు ప్రభుత్వాన్ని కోరారు.

Next Story