న్యాయ వ్యవస్థలో సరికొత్త అడుగు.. హైదరాబాద్‌ కేంద్రంగా UNLU కార్యకలాపాలు

by Vemula.Srinu Prasad |

దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు మరియు బలమైన సాంకేతిక, న్యాయ వ్యవస్థల రూపకల్పనకు సరికొత్త అడుగు పడింది. ..

న్యాయ వ్యవస్థలో సరికొత్త అడుగు.. హైదరాబాద్‌ కేంద్రంగా UNLU కార్యకలాపాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు మరియు బలమైన సాంకేతిక, న్యాయ వ్యవస్థల రూపకల్పనకు సరికొత్త అడుగు పడింది. చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (సీఎన్‌ఎల్‌యూ), హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయూలో ఇంక్యుబేట్ అయిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్టార్టప్ 'గిగా ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ కంప్లయన్స్ రీసెర్చ్ యూనిట్ ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎన్‌ఎల్‌యూ ఛాన్సలర్ జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాని టాగియా, జస్టిస్ రాజేష్ కుమార్ వర్మ, బీహార్ అడ్వకేట్ జనరల్ సత్య దర్శి సంజయ్ పాల్గొన్నారు. అలాగే సీఎన్‌ఎల్‌యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ (డా.) ఫైజాన్ ముస్తఫా, గిగా ఇన్నోవేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. తొగరు అభిషేక్ రెడ్డి, డైరెక్టర్ రావుల రామకాంత్ రెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ (డా.) ఎస్.పీ. సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు బలమైన న్యాయ, సాంకేతిక, పాలనా వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం–2023 అమలు, జాతీయ సైబర్ భద్రతా కార్యక్రమాలు, ఏఐ గవర్నెన్స్, డిజిటల్ పాలనకు సంబంధించిన అంశాలపై ఈ కేంద్రం పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. డేటా, సైబర్ భద్రత, కంప్లయన్స్, గోప్యత, ఏఐ, సైబర్ చట్టాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక అధ్యయనాలతో పాటు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములతో సంయుక్త పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Next Story