- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్యువెలరీ షాపులో 3 తులాల బంగారు ఆభరణం మాయం
by Ratna Kumari |
ఓ జ్యువెలరీ షాపులో 3 తులాల బంగారు ఆభరణం మాయమైన సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది.

X
దిశ, జూబ్లీహిల్స్ : ఓ జ్యువెలరీ షాపులో 3 తులాల బంగారు ఆభరణం మాయమైన సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లోని ముకుంద జ్యువెలరీ షాపులో ఒరిజినల్ బంగారు ఆభరణం స్థానంలో నకిలీ ఆభరణం ఉండటంతో ఇది గమనించిన జ్యువెలరీ యజమాని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పక్కా దుకాణ సిబ్బందే చేతివాటం ప్రదర్శించి అసలు నగలను మాయం చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు షాపు మేనేజర్ ప్రమోద్ రెడ్డి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






