Hyderabad: పిల్లర్స్ తవ్వితే.. కుంగిన 5 అంతస్తుల భవనం..

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని గోషామహల్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

Hyderabad: పిల్లర్స్ తవ్వితే.. కుంగిన 5 అంతస్తుల భవనం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని గోషామహల్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. చాక్నవాడిలోని ఒక ఖాళీ స్థలంలో కొత్త భవన నిర్మాణం కోసం పిల్లర్‌ గుంతలు తవ్వుతుండగా, పక్కనే ఉన్న ఐదు అంతస్తుల భవనం పునాది నుంచి పెద్ద చీలికలు ఏర్పడి భవనం ఒక్కసారిగా కుంగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే గోషామహల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. భవనం తూలిపోవచ్చన్న భయంతో చుట్టుపక్కల నివసిస్తున్న వారు భారీగా బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ఆరు గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదని స్థానికులు తీవ్రంగా ఆరోపించారు.

భవనంలో నివాసం ఉంటున్న కుటుంబాలను తక్షణమే ఖాళీ చేయించాలని కోరుతూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించి భవనం చుట్టుపక్కల ఉన్న నివాసితులను బయటకు తరలించారు. పిల్లర్‌ తవ్వకాలలో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా, చాక్నవాడి మార్కెట్‌ ప్రాంతంలో గతంలో నాలా కుంగిపోయిన విషయం తెలిసిందే.

Next Story