జీఎస్ఐలో జియో సైంటిస్టుల 46వ ఓరియంటేషన్ కోర్సు

by Dishanational1 |
జీఎస్ఐలో జియో సైంటిస్టుల 46వ ఓరియంటేషన్ కోర్సు
X

దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని జీయో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) కార్యాలయంలోని ఎం. ఎస్. కృష్ణన్ ఆడిటోరియంలో శుక్రవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబడిన 46వ బ్యాచ్ జియో సైంటిస్టుల కోసం ఓరియంటేషన్ కోర్సు ముగింపు కార్యక్రమము నిర్వహించారు. 46వ బ్యాచ్ కు చెందిన మొత్తం 64 మంది జియో సైంటిస్టులు ప్రొఫెషనల్ జియాలజిస్టులుగా మారడానికి దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో సుమారు 11 నెలల సుదీర్ఘ కాలం పాటు శిక్షణా సంస్థ ద్వారా విస్తృతంగా శిక్షణ పొందారు. డాక్టర్ ఎస్. రాజు, డైరెక్టర్ జనరల్ జీఎస్ఐ అధ్యక్షతన ముగింపు సభ జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, సదరన్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్, డైరెక్టర్లు, శిక్షణా సంస్థల డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


కోర్సు యొక్క ముగింపు సెషన్ హైదరాబాద్ డైరెక్టర్ శ్యామ ప్రసాద్ భూటియా కోర్సు వివరాలు తెలియజేశారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సీ.హెచ్ వెంకటేశ్వరరావు మాటాడుతూ.. 11 నెలల పాటు సాగిన ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులందరినీ అభినందించారు. క్రమశిక్షణ, అలంకారం, అంకితభావం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కెరీర్ అభివృద్ధిలో దాని ప్రాముఖ్యతను తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో శిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న సాంకేతికతలను ఉపయోగించాలని జియాలజిస్టులకు సూచించారు. డైరెక్టర్ జనరల్ డా. రాజు మాట్లాడుతూ.. జీఎస్ఐ అత్యుత్తమ జియోసైన్స్ ఆర్గనైజేషన్ అని, వివిధ జియోసైన్స్ డొమైన్లలో అద్భుతమైన అధికారుల బృందం ఉందని పేర్కొన్నారు. ఆత్మగౌరవాన్ని, సంపూర్ణ వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవాలని, దేశాభివృద్ధికి దోహదపడే ఖనిజ నిక్షేపాల అన్వేషణకు తమ వంతు కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. భౌగోళిక శాస్త్రవేత్తలు సంస్థ యొక్క భవిష్యత్తు అని డాక్టర్ ఎస్. రాజు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఐటిఐ హైదరాబాద్ డైరెక్టర్ ఆర్. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed