40 గంటల పాటు నిమజ్జనాలు..మిలాద్ ఉన్ నబీ ఉరేగింపు తేదీ మార్పు

by velandi.Saikiran |   (  Updated:2025-09-03 15:24:48  IST  )

సెస్టెంబరు 6వ తేదిన జరిగే సాముహిక గణేష్ నిమజ్జన ఉరేగింపు రూటును బుధవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్,

40 గంటల పాటు నిమజ్జనాలు..మిలాద్ ఉన్ నబీ ఉరేగింపు తేదీ మార్పు
X

దిశ, సిటీక్రైం: సెస్టెంబరు 6వ తేదిన జరిగే సాముహిక గణేష్ నిమజ్జన ఉరేగింపు రూటును బుధవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎమ్ సీ కమిషనర్ కణ్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన, హైడ్రా కమిషనర్ రంగానాధ్, ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోమెల్ డేవిస్, పలు ప్రభుత్వ శాఖ ల ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 19 కిలో మీటర్ల దూరం వరకు కొనసాగే ఉరేగింపుకు ఏలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా సాఫీగా కొనసాగేలా చేపట్టిన చర్యలను రూట్ మార్చ్ చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం దాదాపు 40 గంటల పాటు కొనసాగుతుందని సీపీ ఆనంద్ వివరించారు. ఈ నేపధ్యంలో మండపాల నిర్వాహకులు విగ్రహాలను సమయానికి నిమజ్జనానికి తరలించేలా పోలీసులకు సహాకరించాలని సీపీ కోరారు. ఉరేగింపు సాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారి మళ్ళింపులను ఏర్పాటు చేశామన్నారు.

వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గంలో ప్రయాణీంచాలని సీపీ తెలిపారు. నిమజ్జనానికి మొత్తం 30 వేల మందితో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం షీ టీమ్స్, యాంటీ చైన్ స్నాఛింగ్ టీమ్స్ ను రంగంలోకి దింపామన్నారు. కేంద్ర బలగాలతో పాటు , ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహిస్తున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు. వర్షాల నేపధ్యంలో విద్యుత్ అవాంతరాలు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా వైర్లకు సంబంధించిన విషయాల పై కూడా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి వాటిని పరిశీలించామని చెప్పారు. మిలాద్ ఉన్ నబీ పండుగ నేపధ్యంలో 6వ తేదిన జరగాల్సిన ర్యాలీని మత పెద్దలు పెద్దమనస్సుతో గణేష్ ఉరేగింపును దృష్టి లో పెట్టుకుని ఆ ర్యాలీని సెప్టెంబరు 14 తేదికి మార్చుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అంతకు ముందు సీపీ ఆనంద్ బ్రుందం బాలాపూర్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

Next Story