Hydra: ఇందిరాపార్కు క‌బ్జాలే నిదర్శనం.. హైడ్రా ప్ర‌జావాణికి 46 ఫిర్యాదులు

by Ramesh Naini |

నగరంలో పలు చోట్ల పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించి ప‌లు లే ఔట్ల‌లో కేటాయించిన స్థ‌లాల‌ను అక్క‌డి కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులే క‌బ్జాలు చేస్తున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

Hydra: ఇందిరాపార్కు క‌బ్జాలే నిదర్శనం.. హైడ్రా ప్ర‌జావాణికి 46 ఫిర్యాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో పలు చోట్ల పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించి ప‌లు లే ఔట్ల‌లో కేటాయించిన స్థ‌లాల‌ను అక్క‌డి కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులే క‌బ్జాలు చేస్తున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. సోమ‌వారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా (HYDRA) ప్రజావాణి (PRAJAVANI) కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్ర‌జావాణిలో మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కొంత మంది కాల‌నీ ర‌హ‌దారుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా.. ముందుకు జ‌రిగి ప్ర‌హ‌రీలు నిర్మిస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారిని అధికారులు సోమవారం ఎక్స్ వేదికగా విషయాలను పంచుకున్నారు. ప్ర‌జావ‌స‌రాల‌కోసం దాత‌లు ఇచ్చిన భూముల‌ను కూడా వ‌ద‌ల‌డంలేద‌ని ప‌లురువురు పేర్కొన్నారిని స్పష్టం చేశారు. అందుకు నగరంలోని (Indira Park) ఇందిరాపార్కు క‌బ్జాలే నిద‌ర్శ‌న‌మ‌ని వాక‌ర్స్ తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.

Next Story