మియాపూర్లో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి బాలుడు మృతి

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది.

మియాపూర్లో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి బాలుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లోని మార్తాండ నగర్ కాలనీలో శ్రీను, నీలా దంపతుల నాలుగేళ్ల కుమారుడు అభి... ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ కుటుంబం ఇటీవలే హైదరాబాద్‌కు పని కోసం వలస వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. మియాపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సంపు యజమాని నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానంగా సంపు చుట్టూ తగిన రక్షణ ఏర్పాటు చేయకుండా ఓపెన్‌గా ఉంచడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అప్పటివరకు కళ్ళముందు ఆడుకుంటున్న పసివాడు ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Next Story